Playstore Icon
Download Jar App
Financial Education

21 ఏళ్ల వయస్సులో మనం తెలుసుకొని ఉండాల్సిన 7 ఆర్థిక చిట్కాలు – జార్​ యాప్

December 28, 2022

బడ్జెట్‌ వేసుకోవడం, మీ వంట మీరే వండుకోవడం లేదా సరైన డీల్స్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎంత డబ్బు ఆదా చేయవచ్చో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే చూడండి మరి.

మీకు 21 సంవత్సరాలప్పుడో లేదంటే మీ ఇరవైల మొదట్లో, అంటే మీరు కొత్తగా ‘ఎదిగిన వ్యక్తి’ గా ఉన్న రోజుల్లో, మీ దగ్గర చాలా సమయం ఉంటుంది. కానీ, ఎక్కువ డబ్బు ఉండదు, కదా?

 

మీకు ఎన్నో బాధ్యతలు ఉండి ఉంటాయి, అయినా కూడా, మీకు ట్రావెల్ చేయడానికి, మీకు ఏది ముఖ్యమో నిర్ణయించుకోవడానికి, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి (లేదా వద్దనుకోవడానికి), అలాగే ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవడానికి మీకు సమయం ఉంటుంది.

మీరు ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లు చేసుకుంటే, మీరు చిన్న వయస్సు నుండి మీ ఆర్థిక బాధ్యతలను కూడా తీసుకోవచ్చు. మమ్మల్ని నమ్మండి, ఇది మీరు అనుకున్నదాని కంటే చాలా సులువు!

 

ఈ ప్రారంభ సంవత్సరాలు మీకు పునాది. ఇప్పుడు మీరు ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకుంటే, మీ 30లలోను, 40 లలోను, 50 లలోను, ఆ పై వయస్సులో కూడా మీరు ఎంతో సంతోషంగా ఉండవచ్చు.

మీ డబ్బు పెరగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఇప్పుడు మీరు దానిని పక్కన పెట్టడం మొదలుపెడితే, మీరు పదవీ విరమణ పొందేనాటికి అది ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి మీరు మీ ఆర్థిక స్థితిని ఒక పద్ధతిలో ఉంచాలని నిర్ణయించుకున్నాక, ఎక్కడ నుంచి, ఎలా మొదలుపెట్టాలి? అనే అయోమయంలో ఉన్నారా?

మీరు యువకులైతే మిమ్మల్ని నడిపించడానికి, మీరు పాటించాల్సిన 7 ఆర్థిక చిట్కాలతో మేము జార్​ వద్ద సిద్ధంగా ఉన్నాము:

 

1. మీ డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోండి

 

మీ డబ్బును మేనేజ్ చేసుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు. దానికోసం మీరు ఆర్ధిక నిపుణులు కానవసరం లేదు. ఖచ్చితంగా చేయాలనే అంకితభావం ఉంటే చాలు.

పొదుపు చేయడం మొదలు పెట్టడమే మీరు వేయాల్సిన మొదటి అడుగు. ఒక సేవింగ్స్ అకౌంట్ తెరవండి. ఆర్థిక స్వేచ్చ పొందడానికి ఇది ఒక గొప్ప అడుగు అవుతుంది.

 

ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోండి. వాటిని ఎలా సాధించాలో తెలుసుకోండి. ప్రస్తుతం, ఈ వయసులో మీకు పెద్ద పెద్ద లక్ష్యాలేమీ ఉండవు, ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి అత్యవసర నిధి ఒకటి పెట్టుకొని, అందులో కొద్దికొద్దిగా డబ్బు దాచిపెట్టడం మొదలుపెట్టండి. ఇది మీకు ఎప్పుడు అవసరమవుతుందో మీకే తెలియదు.

 

మీకు జీతం వచ్చిన వెంటనే, దానిని రకరకాల విభాగాలుగా వర్గీకరించి దానిలో కనీసం 10% పొదుపు చేసేందుకు పక్కన పెట్టండి.‍

మీరు అంతకంటే ఎక్కువ కూడా పొదుపు చేయవచ్చు; ఎంత ఎక్కువ దాచితే అంత మంచిది. కానీ మీ బ్యాంక్ అకౌంట్​లో మాత్రం దాచకండి, ఎందుకంటే దానివల్ల మీకు లాభమేమీ రాదు. కానీ డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్‌లు, ఎఫ్​డీలు మొదలైన కొన్ని లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ సేవింగ్స్​ను ఎక్కువ రోజులపాటు ఈ సాధనాల్లో ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టి అది మేజిక్ లాగా ఎలా పెరుగుతుందో చూడండి.

మీరు ఒక బడ్జెట్‌ తయారు చేసుకొని మీ ఖర్చులు, మీరు చేస్తున్న పొదుపును రాసుకోవాలి. ఎటువంటి ఖర్చులు చేస్తున్నారో చూసుకుంటూ ఉండటం అలవాటు చేసుకోండి.

 

ఇలా మీ డబ్బును మేనేజ్ చేసుకోవడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు ఎంత త్వరగా ఆర్థిక విషయాలను మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే, మీ భవిష్యత్తు అంత బాగుంటుంది.

2. మీ ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్​ఫోలియో రూపొందించుకోండి

 

మీరు పొదుపు చేసిన డబ్బును  ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైన, లేదంటే మీరు దాచుకున్న డబ్బుపైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ డబ్బు మిమ్మల్ని ఆర్థికంగా స్వతంత్రులను చేస్తుంది.

మీ డబ్బును ఇన్వెస్ట్ చేయడం అనేది మీరు డబ్బు దాచుకోవడానికి లేదా ద్రవ్యోల్బణంతో పోరాడటానికి ఒక అద్భుతమైన మార్గం.

మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అంత మంచిది. పెట్టుబడి అనేది మీరు ప్రస్తుతం ఉన్న స్థితికి, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆ స్థితికి మధ్య వారధిగా ఉంటుంది, అవును.

అందువల్ల, చిన్న వయస్సు నుండే మీ మొదటి ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవడం అనేది ఒక గొప్ప విజయం. వీటన్నింటికంటే ముఖ్యంగా మీ ఆస్తిని పెంచుకోవడంలో ఇది మీ మొదటి అడుగు.

పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవడం అంటే మీ పెట్టుబడిని ఈక్విటీలు, నగదు, ఋణాలు వంటి విభాగాలుగా విస్తరించడం. దీన్ని ఆస్తుల కేటాయింపు అంటారు.

మీరు ఇన్వెస్ట్ చేసే కాలం సుమారు 10-15 సంవత్సరాలు ఉండాలి. మీ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకున్న తర్వాత, మార్కెట్‌లో హెచ్చుతగ్గులను, కదలికలను అంచనా వేయడం ద్వారా రిస్క్‌ల నుండి పోర్ట్‌ఫోలియోను దూరంగా ఉంచడానికి మీరు ప్రతి 6 నెలలకోసారి దాన్ని మళ్లీ చూసుకుని, రీబ్యాలెన్స్ చేసుకోవాలి.

ద్రవ్యోల్బణం వల్ల ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతుంటాయి. మీరు పెట్టుబడి పెట్టకపోతే ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడే మార్పులకు తగ్గట్టు మీ డబ్బును ఖర్చు చేసుకోలేరు. లేదా, బహుశా పదవీ విరమణ పొందాక మీకు నచ్చినట్టు మీరు ఉండలేకపోవచ్చు. మీరు ఎంత రిస్కు చేయగలరో చూసుకొని దానికి తగ్గట్టు ఇన్వెస్ట్ చేసుకోండి.

3. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి

 

ఒకసారి మీరు పొదుపు చేయడం, బడ్జెట్ నిర్వహించడం మొదలుపెడితే మీ దగ్గర ఏముందో, మీకు ఏమి కావాలో తెలిసిపోతుంది.

మీ ఖర్చులను మారేవి మారనివి, అవసరాలు లేదా కోరికలు, తప్పనివి లేదా తప్పేవి అన్నట్టు విభజించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల, మీ దగ్గర ఒక పూర్తి జాబితా ఉంటుంది. వీటిని ఒక క్రమంలో ఏర్పాటు చేసుకొని వాటిలో ఏవి ముఖ్యమో వాటికి ప్రాధాన్యతనివ్వండి.

 

మీ కోరికలు అపరిమితంగా ఉన్నప్పటికీ మీ వనరులు పరిమితమైనవేనని మీరు గ్రహించాలి. ఇక్కడ మీరు సమతుల్యతను కాపాడుకోవాలి.

 

మీరు దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే, ఆపగలిగే ఖర్చులను అంత బాగా నియంత్రించవచ్చు.

బోనస్ చిట్కాలు: మీకు ఇప్పటికీ వంట రాకపోతే ఇప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి. రుచికరమైన, పోషకాహారాన్ని మీరే వండుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

 

మీరు మీ ఇంట్లో కాకుండా వేరే చోట నివశిస్తూ ఉంటే గనక ఫ్లాట్‌మేట్‌లతో కలిసి ఉండండి. దీనివల్ల చాలా ఖర్చులు పంచుకోబడుతాయి. తద్వారా మీకు ఎంతో కొంత డబ్బు మిగులుతుంది.

 

కారు ఖచ్చితంగా అవసరమయ్యే నగరంలో ఉంటుంటే తప్ప కారు కొనకండి. ద్విచక్రవాహనాన్ని గానీ, లేదంటే ప్రజా రవాణా వ్యవస్థను గానీ ఉపయోగించండి.

 

4. రుణాలని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి

రుణాలన్నింటిలోనూ అత్యంత ఖరీదైనది క్రెడిట్ కార్డ్ అని మీకు తెలుసా? దాన్ని పదే పదే ఉపయోగిస్తే మీకు తెలియకుండానే మీరు ఆర్థిక ఉచ్చులో పడి అందులో బిగుసుకుపోతారు.

 

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకొనేదానిలా క్రెడిట్ కార్డును ఉంచుకోండి.

 

కారు గానీ, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గానీ, ఉన్నత విద్య గానీ ఇలా మీరు ఎన్నో ఆర్థిక లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు. మీకు ఇలాంటి వాటన్నింటికీ డబ్బు చాలా అవసరం అవుతుంది.

 

కానీ అది ఎక్కడ నుండి వస్తుంది? లేదు, అప్పు కాదు. పొదుపు చేయడమే సరైన మార్గం!

 

మీ అప్పులను ఎలా తీర్చాలో ఆలోచించుకొని పెట్టుకోవడం వల్ల మీరు ఘోరమైన అప్పుల ఉచ్చులో పడకుండా దూరంగా ఉండవచ్చు. మీరు ఎవరికి ఎంత అప్పు ఉన్నారో తెలుసుకోవాలి.

వాటిని తీర్చడానికి మీ సమయం కొంత కేటాయించుకోండి. మీకు చాలా అప్పులు ఉంటే గనుక, అన్నింటికంటే పెద్ద అప్పును ముందుగా తీర్చడం మొదలుపెట్టండి.

 

మరీ తప్పకపోతే తప్ప అప్పు తీసుకోకూడదనే సూత్రాన్ని ఎప్పుడూ పాటించండి. ఇంక ఏ దారీ లేదనుకున్నప్పుడే అప్పు తీసుకోవాలని నిశ్చయించుకోండి. ఏమి కొనుగోలు చేసినా వీలైనంతవరకు అప్పటికప్పుడే డౌన్ పేమెంట్స్ చేసేయండి. ఇంకా, మీరు పర్సనల్​ లోన్​ లాంటి ట్యాక్స్​ కట్టాల్సి వచ్చే లోన్​లు తీసుకోకండి.

 

మీ లక్ష్యాలను సాధించడానికి ఒక మూల నిధిలా కొంత దాచుకోవడం, దాన్ని మేనేజ్ చేయడం లాంటి వాటి గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. దీనిద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు.

5. మీ నైపుణ్యాలు పెంచుకోండి

మీరు మీ డబ్బుతో ఏమి చేయాలనే దాని గురించి ఆలోచించే ముందు మీరు కొంత డబ్బు సంపాదించాలి. అవునా?

మా దృష్టిలో నైపుణ్యాలు అంటే, చాలా దూరపు ఆలోచన. మేము కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే కాకుండా మీ మొత్తం కెరీర్‌పై దృష్టి పెడుతున్నాము.

 

ఎందుకంటే, మీ మొదటి ఉద్యోగమే మీకు చివరిది కాదు. మీకు అది నచ్చకపోవచ్చు. అయితే, మీ వంతు కృషి చేయాలనే ఉత్సాహం మీకు ఉండాలి.

మీరు నేటి ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకొని, అవసరమైన సామర్థ్యాలను సంపాదించుకుంటే, నిజంగా ఈ ప్రపంచం మీ చేతిలో ఉంటుంది.

మీ రెజ్యూమేలో రకరకాల నైపుణ్యాలను మీరు ప్రదర్శిస్తే మీకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు అప్లై చేసిన చోట ఉండే అధికారులకు మిగతా అభ్యర్థుల కంటే మీరు ఎంతో మెరుగ్గా అనిపించవచ్చు. జీతం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎక్కువ జీతం అడగగలుగుతారు.

6. ఎలా నెగోషియేట్ చేయాలో నేర్చుకోండి

నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత, మీరు నెగోషియేషన్ యొక్క గొప్పతనమేంటో తెలుసుకోవాలి.

 

Salary.com వాళ్ళు చేసిన ఒక సర్వేలో కేవలం 37% మంది మాత్రమే ఎప్పుడూ జీతం గురించి నెగోషియేట్ చేస్తారని తెలిసింది- అయితే నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే 18% మంది అసలు ఎప్పుడూ చేయరట.

 

మరీ ఘోరం ఏమిటంటే, వారి పర్ఫార్మెన్స్ రివ్యూ అప్పుడు, 44% మంది ఆ మాట కూడా తీసుకురాలేదని తెలిసింది.

 

ఎక్కువ అడగకపోవడానికి అసలు ముఖ్య కారణం ఏమిటి? భయం.

మాకు అది అర్థమయ్యింది: జీతం గురించి మాట్లాడటం అంటే భయంగానే ఉంటుంది. అయితే అంతకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? అస్సలు మాట్లాడకపోవడం.

 

కాబట్టి మీరు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, మీ మొదటిదో లేదా ఐదవదో ఉద్యోగంలో, జీతం గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి ఇదే సమయం.

 

7. మీ షాపింగ్ పిచ్చి తగ్గించుకోండి

 

తెలివిగా షాపింగ్​ చేసేవాళ్లు డీల్స్​పై ఆధారపడి షాపింగ్​ చేసేవారి కంటే ఎక్కువ. మీరు డీల్‌ను వెతికే టెక్నిక్‌లో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత, మీరు స్మార్ట్ షాపర్‌ అవుతారు. ఏదైనా వస్తువును కొనే ముందే ఆ వస్తువు నిజంగా కావాలో వద్దో నిర్ణయించుకోవాలి.

 

మీకు నచ్చాయి కదా అని వస్తువులను కొనేయకూడదు. అనవసరమైన వాటిని కొనుక్కోవడానికి ముందు ఒక 24 గంటలు ఆగండి. మీకు అది నిజంగా అవసరమా, దానిని ఉపయోగిస్తారా అని ఆలోచించుకోండి.

 

తిండి, బట్టలు, ఇంట్లో వాడుకొనే వస్తువులు మొదలైన ప్రతీదానిపై మంచి డీల్ ఏముందో చూడండి. మీరు డీల్ కోసం వెతికితే మీ జీవితంలో చాలా డబ్బు ఆదా అవుతుంది.

మీరు ఏదైనా కొనే ముందు ప్లాన్‌ చేసుకొని షాపింగ్ చేయాలి. డబ్బు ఆదా చేయడానికి సులువైన మార్గాలలో ఒకటి అవసరమైనవాటి జాబితా తయారు చేసుకోవడం, దానికి కట్టుబడి ఉండటం.

 

ఇది ప్రతి ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే అవసరమయ్యే ఒక సాధారణ అలవాటు.

 

మీరు తయారు చేసుకున్న జాబితాలో మీరు ఊరికే సరదాగా నచ్చి చేసే ఖర్చులను తగ్గించుకుని సమయాన్ని, డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు.

చివరిగా, ముఖ్యమైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించాలని మేము మీకు సలహా ఇస్తున్నాము.

 

మీరు దీన్ని అలవాటు చేసుకుంటే మీ డబ్బును మేనేజ్ చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి మీరు ఈ  అలవాటు చేసేసుకోండి.

మీ పొదుపు, పెట్టుబడులను సరిగ్గా మొదలుపెట్టడానికి, మీ సంపద పెంచుకోవడానికి ఈ చిట్కాలను అనుసరించండి. మీ వయస్సు యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరు ఒక ఆస్తిగా మార్చేసుకోండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.