Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Credit Score
Nek Jewellery
మీరు ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొనుగోలు, అమ్మకపు ధరల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే అది చాలా అవసరం.
స్టాక్స్ కాకుండా వేరే సాధనాల్లో మీరు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టారా? మ్యూచువల్ ఫండ్స్, బంగారం, వెండి, బాండ్లు, మొదలైనవాటిలో.
మీరు విలువైన లోహాలను కొనుగోలు చేయాలని అనుకున్నపుడు లేదా ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచించినప్పుడు మీరు ఆ వస్తువుల కొనుగోలు ధర, అమ్మకపు ధరలను గురించి తెలుసుకోవాలి.
అసలు ఈ రెండు ధరలు ఏంటి? అలాగే ప్రతి వస్తువుకు సంబంధించి కొనుగోలు ధర అమ్మకపు ధర కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
కొనుగోలు లేదా బిడ్ ధరను మీరు ఏదైనా షేర్ లేదా ఇతర వస్తువును కొనుగోలు చేసినప్పుడు చెల్లిస్తారు. అమ్మకపు ధర అనేది మీరు వస్తువును అమ్మినప్పుడు పొందుతారు.
కొనుగోలు, అమ్మకపు ధరల మధ్య తేడా అనేది మీరు బ్రోకర్‌కు లేదా మధ్యవర్తికి చెల్లించే కమీషన్. దీనినే వ్యాప్తి (ఇంగ్లిష్‌లో Spread) అని పిలుస్తారు.
కొనుగోలుదారులు, అమ్మకపుదారులు ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉంటున్నారు. కానీ ప్రస్తుతం అనేక వ్యాపారాలు మనుషుల చేతే నిర్వహించబడుతున్నాయి. కానీ వారికి ఏదో విధంగా పరిహారం చెల్లించాలి కదా.
ధరల వ్యాప్తి అనేది సాధారణంగా మార్కెట్ ధరలతో కేంద్రీకృతమై ఉంటుంది. ఇది అమ్మకపు, కొనుగోలు ధరల మధ్య ఎక్కడో ఒక చోట ఉంటుంది.
మీరు ట్రేడ్ చేసే ఆస్తి కొనుగోలు ధర దాని అమ్మకపు ధర కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అదనంగా మీరు చెల్లించే/అందుకునే ధర అనేది మార్కెట్ ధరల వలన కొంత వరకు మారుతూ ఉంటుంది. దీనికి కారణం ధరల వ్యాప్తి.
మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ధరల వ్యాప్తి ఎలా ఉంటుందో వాల్యూ రీసెర్చ్ క్లుప్తంగా వివరిస్తుంది.
ఉదాహరణకు.. మీరు రూ. 5,000 ఒక ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. దాని నెట్ అసెట్ వాల్యూ (NAV) రూ. 12. ఇంకా ఎంట్రీ లోడ్ చార్జీలు 2 శాతం ఉంటాయి.
అంటే మీరు యూనిట్లను కొనుగోలు చేసే ధర నెట్ అసెట్ వాల్యూ కంటే 2 శాతం ఎక్కువగా ఉంటుంది. రూ. 12లో 2 శాతం అంటూ రూ. 0.24 అన్నమాట.
కాబట్టి.. నెట్ అసెట్ వాల్యూను కలుపుకొంటే మీ కొనుగోలు ధర ఒక్కో యూనిట్‌కు రూ. 12.24 అవుతుంది. ఎంట్రీ లోడ్ ఉన్న సందర్భంలో కొనుగోలు ధర అనేది నెట్ అసెట్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది.
వేరే పద్ధతిలో దీనిని చూసుకుంటే మీ పెట్టుబడిలో 2 శాతం మీటింగ్ లోడ్‌ను తీసేస్తే... రూ. 5,000లలో 2 శాతం అంటే రూ. 100.
ఒకవేళ మీరు రూ. 5000లను పెట్టుబడి పెడితే అందులో నుంచి రూ. 4,900 మాత్రమే ఫండ్‌కు వెళ్తుంది. మిగిలిన రూ. 100 లోడ్ కోసం.
అదేవిధంగా చూసుకున్నట్లయితే నెట్ అసెట్ వాల్యూ విలువ రూ. 12గా ఉన్న ఫండ్‌ను మీరు వదులుకోవాలని అనుకున్నప్పుడు అందులో నుంచి 2 శాతం ఎగ్జిస్ట్ లోడ్ తీసేస్తే మీకు కేవలం రూ. 11.76 మాత్రమే వస్తాయి.
ఇక్కడ లోడ్ రూ. 0.24 (నెట్ అసెట్ వాల్యూలో 2 శాతం, రూ. 12) విలువ నెట్ అసెట్ వాల్యూ నుంచి తొలగించబడుతుంది. ఎగ్జిస్ట్ లోడ్ విషయంలో అమ్మకపు ధర ఎల్లప్పుడూ నెట్ అసెట్ వాల్యూ కంటే తక్కువగానే ఉంటుంది.
మీరు పెట్టే అధిక పెట్టుబడులు పెట్టుబడి రాబడిని తగ్గించే ఆస్కారం ఉంది. స్టాక్ లేదా కమోడిటీ లిక్విడిటీని అంచనా వేసేందుకు ఇన్వెస్టర్లు వ్యాప్తిని ఉపయోగిస్తారు. ధరల వ్యాప్తి నియంత్రణలో ఉన్నపుడు స్టాక్ గణనీయంగా మారుతుంది.
చెప్పాలంటే.. చాలా మంది ఇన్వెస్టర్లు వారు ఎంత చెల్లిస్తున్నారో, వారి పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకునేందుకు ఎక్కువ కష్టపడతారు.
ప్రముఖ స్టాక్‌లలో ధరల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. తక్కువగా ట్రేడ్ చేయబడే చిన్న స్టాక్‌లలో ధరల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ప్రముఖ స్టాక్‌లలో, తక్కువ పేరున్న స్టాక్‌లలో మీరు ఎంత చెల్లిస్తున్నారో అంతగా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఒక ఉదాహరణను తీసుకుందాం. నిరంతరం మారుతున్న ధరల నడుమ ఉత్పత్తులను కలిగి ఉన్న ఒక షాప్ యజమానిగా మీ బ్రోకర్ పరిస్థితిని గురించి ఆలోచించండి.
ప్యాకేజ్ చేసి ఉండే తాగునీటికి అతడి దుకాణంలో చాలా డిమాండ్ ఉంది. అతడు ఒక్కో బాటిల్‌ను రూ. 15కి కొనుగోలు చేసి రూ. 20కి మీకు అందిస్తానని చెబుతాడు.
వేడిగా ఉండే రోజులలో అతడు అనేక బాటిల్స్‌ను అమ్ముతాడు. కానీ చలికాలంలో అతడు ఎక్కువ వాటర్ బాటిళ్లను అమ్మలేడు. అతడు ఆ రోజుల్లో బాటిల్ నీటిని కేవలం రూ. 10కే పొందుతాడు. కానీ అమ్మకాల సంఖ్యకు అనుగుణంగా లాభాలను పెంచేందుకు అప్పుడు ఆ బాటిల్‌ను రూ. 25కి అమ్ముతాడు.
కాబట్టి ధరల వ్యాప్తిపై ఓ కన్నేసి ఉంచండి. లిక్విడ్ స్టాక్ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే మీరు ట్రేడ్ చేసేది ఆ వస్తువునే. మీరు అమ్మాలనుకుంటున్న వస్తువుకు కొనుగోలుదారుడిని తీసుకురావడం ఎంత సులభమో మీరు తెలుసుకోవాలి.
నిధులను పోల్చేందుకు ఉన్న సులభమైన మార్గాలలో వ్యయ నిష్పత్తి ఒకటి. ఇందులో అన్ని రకాల ఖర్చులు కవర్ కానప్పటికీ... బ్రోకర్లు, మధ్యవర్తి సంస్థలకు ఫండ్స్‌లో ఎంత కమీషన్ శాతం ఉందనేది ఇది చూపిస్తుంది.
మీరు చెల్లించే ఫీజుకు, ఫండ్‌కు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. అధిక ధరల నిష్పత్తి మీ ఇతర ఫండ్స్ కంటే కూడా వెనుకబడి ఉంటుంది.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
● లాంగ్ పొజీషన్: మీరు ఆస్తి ధర పెరుగుదలను చూడాలనే ఆశతో దానిని అలాగే ఉంచుకొని కొనసాగితే మీరు లాంగ్ పొజీషన్ తీసుకున్నారని అర్థం.
● షార్ట్ పొజీషన్: ఆస్తి ధర తగ్గుతుందని మీరు భావించి విక్రయిస్తే మీరు షార్ట్ పొజీషన్ తీసుకున్నట్లు అర్థం.
కొనుగోలుదారులు అమ్మకపుదారుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతుంది. అలాగే కొనుగోలుదారులు అమ్మకపుదారుల కంటే తక్కువగా ఉన్నప్పుడు సరఫరా పెరిగి ధర తగ్గుతుంది. అదేవిధంగా డిమాండ్ కూడా తగ్గుతుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
ప్రతి వస్తువుకు కొనుగోలు, అమ్మకపు ధర ఉంటుంది. బంగారానికి కూడా రెండు ధరలు ఉంటాయి. బంగారం కొనాలనుకుంటున్నప్పుడు ఒక ధర, అమ్మాల్సి వస్తే మరో ధర ఉంటుంది.
కొనుగోలుదారుడికి అమ్మకపుదారుడు ధరలో రాయితీ ఇవ్వడానికి అంగీకరిస్తే.. వారు బేరం కుదుర్చుకున్నట్లు భావిస్తారు.
అనేక సందర్భాల్లో కొనుగోలు, అమ్మకపు ధరలు చాలా దగ్గరగా (వ్యత్యాసం తక్కువగా) ఉంటుంది. ఇక బంగారం విషయానికి వస్తే ఈ తేడా మరింత తక్కువగా ఉంటుంది.
బంగారం కూడా ఇతర వస్తువులలాగే కొనుగోలు, అమ్మకపు ధరలను కలిగి ఉంటుంది. కేవలం 3 శాతం జీఎస్టీ, ప్రాసెసింగ్ చార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలు వర్తిస్తాయి. డిజిటల్ గోల్డ్ లావాదేవీల్లో ఈ చార్జీలు మాత్రమే ఉంటాయి.
ధరల్లో ఒడిదుడుకులు, సరఫరా, మార్కెట్ పరిస్థితులు, అన్ని ఇతర కారకాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. అందువలనే ధరల్లో అనుకోని మార్పులు వస్తాయి.
అందుకోసమే బంగారు నాణేల అమ్మకం, కొనుగోలు చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. 8-10 శాతం వరకు తేడా ఉంటుంది. ఎందుకంటే బంగారు నాణేలను తయారు చేసేందుకు తయారీ చార్జీలు వసూలు చేస్తారు. బంగారు ఆభరణాలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఇక్కడ భౌతిక రూపంలోని బంగారం, డిజిటల్ గోల్డ్ మధ్య వ్యత్యాసం గురించి మరింత చదవండి.
మీరు విక్రయించాలనుకున్నప్పుడు ఆ ధరలో జీఎస్టీ కలపబడుతుంది. అంతేకాకుండా స్టోరేజ్, ఇన్సూరెన్స్ ఫీజులు కూడా ఉంటాయి. కొనుగోలు ధర కేవలం కమర్షియల్ బులియన్ మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎటువంటి ఫీజలు ఉండవు.
మీరు జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్‌ను చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. - ఎక్కడైనా, ఎప్పుడైనా..