Playstore Icon
Download Jar App
Savings

సేవింగ్ అకౌంట్లు మిమ్మల్ని ఎందుకు పేదవారిగా చేస్తున్నాయి - జార్ యాప్

December 29, 2022

మీ డబ్బును సేవింగ్స్​ అకౌంట్‎లో ఉంచడం మిమ్మల్ని ఎలా పేదవారిగా మారుస్తుంది, మీకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో తెలుసుకోండి.

మీ నెలవారీ జీతాన్ని పొందడం ప్రపంచంలోని ఉత్తమమైన ఫీలింగ్స్ లో ఒకటి, కదా?

మన జీవితకాలంలో ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి అనుమతించే జీతం వంటి ప్రాథమిక మైన దాని కోసం 30-40 సంవత్సరాల పాటు వారానికి 40-50 గంటలు కష్టపడతాము.

జీవనోపాధిని సాధించాం. మన ఆ డబ్బును సేవింగ్స్ అకౌంట్​లో ఉంచాము. తద్వారా మనకు అవసరమైనప్పుడల్లా నగదు అందుబాటులో ఉంటుంది.

సేవింగ్స్​ అకౌంట్లు ఏడాదికి 2 నుంచి 4% వడ్డీ చెల్లిస్తాయి. ఇది పెట్టుబడిపై ఉత్తమ రాబడి కాకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా ఏమీ లేకపోవడం కంటేనైతే మంచిదే.


అలాంటప్పుడు సేవింగ్స్ అకౌంట్ మనల్ని పేదవారిగా ఎలా చేస్తుంది?

దానికి సమాధానం ద్రవ్యోల్బణం.

దురదృష్టవశాత్తు, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటి. కానీ మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించగలమా అనే ఆందోళన చెందవద్దు, ఇక్కడి ఈ ౩ సింపుల్ స్టెప్పులతో ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు.

ప్రతి ఒక్కరూ ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రాథమిక అవసరాల ఖర్చులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.

నేటి మార్కెట్ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 6% వద్ద లేదా అంతకంటే ఎక్కువ వద్ద ఉంది. మెట్రో ప్రాంతాల్లో ఇది గణనీయంగా ఎక్కువగా ఉంది.

అంటే పెరగకుండా మీ బ్యాంక్ అకౌంట్​లోని డబ్బు విలువ క్రమంగా క్షీణిస్తోంది.

ఒకవేళ మీరు ఒకసారి లెక్కించినట్లయితే, 10-15 సంవత్సరాల కాలంలో, మీ కొనుగోలు శక్తి 20%-30% వరకు క్షీణిస్తుందని గుర్తిస్తారు.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ద్రవ్యోల్బణ రేట్లు ప్రజలు వారి బ్యాంకు అకౌంట్లలో సంపాదించే దాని కంటే దాదాపు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉన్నాయి.

మీ సేవింగ్స్ కంటే ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి, మీ సేవింగ్స్​ అకౌంట్​లో ఉన్న డబ్బు కాలక్రమేణా విలువను కోల్పోతోంది.

దీనిని ఎదుర్కోవడానికి, ద్రవ్యోల్బణంతో సమానంగా మీ డబ్బును పెంచడానికి, ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టండి.

గత కొద్ది సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు గమనించి ఉంటారు -

    మీ కిరాణా ఖర్చులు పెరిగాయి.

●     మీ పండ్లు, కూరగాయల ఖర్చు పెరిగింది.

●     మీ ఇంటి అద్దె పెరిగింది

●     మీ వైద్య ఖర్చులు పెరిగాయి

●     సినిమా టికెట్ల ధరలు కూడా పెరిగాయి

●     రెస్టారెంట్ల బిల్లులు పెరిగాయి

●     దాదాపుగా అన్ని రకాల వస్తువులు, సేవల ఖర్చులు పెరిగాయి

ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం:

భారతదేశంలో సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లు సగటున 3.5%, ద్రవ్యోల్బణం సగటున 4.5% ఉంటోంది.

కాబట్టి మీరు సేవింగ్స్​ అకౌంట్​లో ₹100 ఉంచి, 3.5% వార్షిక వడ్డీని పొందితే, మీ పెట్టుబడి విలువ ఒక సంవత్సరం తరువాత ₹103.5 అవుతుంది.

కానీ ఒక సంవత్సరం క్రితం ₹100 ఖర్చు అయితే, వాటికే ఇప్పుడు ₹104.5 ఖర్చవుతుంది. సంవత్సరాలు గడిచిన కొద్దీ ఈ అంతరం మరింత ఎక్కువ అవుతోంది.

అంటే మీరు సేవింగ్స్ అకౌంట్​లో డబ్బు పెట్టి 3.5% వడ్డీ సంపాదించినప్పటికీ, ఒక సంవత్సరం క్రితం ₹100 కు మీరు పొందగలిగిన అదే వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి మీకు అదనంగా ₹1 అవసరం అవుతుంది.

ద్రవ్యోల్బణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ మరో ఉదాహరణ కూడా ఉంది:

పర్నిక, శ్రేయ, ముస్కాన్ అనేవారు ముగ్గురు స్నేహితులు. 2020వ సంవత్సరంలో వారు ముగ్గురికీ ₹5 లక్షలు చొప్పున లభించాయి.

అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా కరోనా కాలంలో ఈ డబ్బు అవసరం. వారు ప్రతి ఒక్కరూ రకరకాల వ్యూహాలను ఎంచుకున్నారు. 

●     పర్నిక నగదును అలాగే ఆస్వాదిస్తుంది. ఆమె తన సేవింగ్స్ అకౌంట్​లో డబ్బులు ఉంచింది.

●     అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రత్యామ్నాయాల గురించి శ్రేయకు తెలియదు. ఫలితంగా ఆమె కూడా ఆ డబ్బును తన బ్యాంక్ అకౌంట్​లో ఆదా చేస్తుంది.

●     ముస్కాన్​కు లిక్విడ్ ఫండ్స్ గురించి తెలుసు. దీంతో ఆమె తన డబ్బును ఒక చోట పెట్టుబడిగా పెట్టింది.

రాబోయే 20 సంవత్సరాల్లో, పెట్టుబడి విలువ ఎంత?‍

●     ప్రతి సంవత్సరం, పర్నిక యొక్క పెట్టుబడి విలువ తగ్గుతోంది. 20 సంవత్సరాల తరువాత బ్యాంకు అకౌంట్​లో దాచిన ₹5 లక్షల విలువ ₹2.07 లక్షలు మాత్రమే. ఇది విలువలో 50% కంటే ఎక్కువ తగ్గుదల. ఇది అత్యంత భయంకరమైన కేటగిరీ.

●     20 ఏళ్లలో శ్రేయ పెట్టుబడి అసలు విలువ ₹5 లక్షల నుంచి ₹4.12 లక్షలకు పడిపోతుంది. అది కూడా మంచిది కాదు.

●     ముస్కాన్ పెట్టుబడి వాస్తవ పరంగా ₹5 లక్షల నుంచి ₹8.32 లక్షలకు పెరిగింది. అది ఆమె సేవింగ్స్​ అకౌంట్​లో ఉన్న మొత్తం కంటే రెట్టింపు.

ద్రవ్యోల్బణంతో పాటు, ఓపెన్ గవర్నమెంట్ డేటా ఫ్లాట్​ఫాం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, గుర్తుంచుకోవాల్సిన ఇతర విషయాలు కొన్ని ఉన్నాయి.

●     ₹10,000 కంటే ఎక్కువ వడ్డీ మీ ఆదాయానికి జోడించబడుతుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను రేటు వద్ద పన్ను విధించబడుతుంది. ఒకవేళ మీరు ఏడాదికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల మధ్య సంపాదించినట్లయితే, అది మీ పొదుపు ఆదాయంపై 20% ఆదాయ వడ్డీ లభిస్తుంది. 3.5% - 4% పొదుపు వడ్డీపై 20% తగ్గింపు తీసుకోవడం వల్ల 2.8% - 3.2% అవుతుండగా, ఇది మీరు నిరంతరం నష్టపోయేలా చేస్తుంది.

●     మీరు ఏడాదికి రూ. 2.5 - 5 లక్షల ఆదాయ శ్లాబ్ కిందకు వచ్చినప్పటికీ, పొదుపు వడ్డీని జోడించిన తరువాత మీ తుది ఆదాయాన్ని బట్టి పన్నుల తరువాత సమర్థవంతమైన లాభాలు 2.8% - 3.8% మధ్య ఉంటాయి.

 

మీరు మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్ కాక మరోచోట ఉంచడానికి మంచి ఆప్షన్ ఉందా?

ఉంది, మీ సేవింగ్ అకౌంట్​లో కనీస నగదును ఉంచిన తర్వాత, మీ మిగతా డబ్బును వేరే చోట పెట్టే ఆప్షన్లు ఉన్నాయి.

తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మిగిలిన నిధులను మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం వివిధ రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. వాటి వల్ల:

●     మంచి వడ్డీ రేట్లు వస్తాయి

●     ట్యాక్స్ బిల్లును తగ్గిస్తాయి

●     మీ నికర ఆస్తిని పెంచుతాయి

మీ ఆదాయం, ఖర్చులు మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎంత పెట్టుబడి పెడతారో నిర్ణయిస్తాయి. మీ పొదుపులో కొన్నింటిని మంచి ఉపయోగానికి ఉంచడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి: 

1. బంగారంలో పెట్టుబడి పెట్టడం

బంగారం అనేది ఒక విలువైన ఆస్తి. దీని విలువ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఇది భద్రమైనదే గాక సురక్షితమైన పెట్టుబడిగా కూడా మారింది.

గత ఐదేళ్లలో బంగారం 20% కంటే ఎక్కువ వార్షిక రాబడులను అందించింది. పోర్ట్​ఫోలియో రిస్కును తగ్గించడానికి సహాయపడే మంచి వైవిధ్యకారిణిగా ఇది భావించబడుతుంది.

ఇన్వెస్ట్​మెంట్​ నిపుణుల ప్రకారం, బంగారం పెట్టుబడులు ఒక వ్యక్తి యొక్క నికర పెట్టుబడి పోర్ట్​ఫోలియోలో 5% నుంచి 10% వరకు ఉండాలి. 

ఇప్పుడు మొత్తం ప్రపంచం డిజిటల్​గా మారడంతో, డిజిటల్ గోల్డ్ మరింత ప్రజాదరణ పొందుతోంది.

డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి అని అడుగుతారేమో? ఇది భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయం మాత్రమే.

ఇది మారకపు రేటు మాయాజాలాలకు దూరంగా వేరియన్స్ ఫ్రీగా ఉంటుంది. పెట్టుబడిదారుడు వాస్తవానికి భౌతిక బంగారాన్ని తాకకుండానే ప్రపంచవ్యాప్తంగా సులభంగా వాణిజ్యం చేయడానికి అనుమతిస్తుంది.

2. బాండ్స్‎లో పెట్టుబడి పెట్టడం

బాండ్ అనేది, ఐవోయూ (IOU) వంటి బాండ్ డెట్ సెక్యూరిటీ. రుణగ్రహీతలు నిర్ణీత కాలానికి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు బాండ్లను విక్రయిస్తారు.

రిస్కులు తీసుకోకూడదని భావిస్తే మాత్రం బాండ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం.

మీరు ఒక బాండ్ కొనుగోలు చేసినప్పుడు, మీరు జారీ చేసే వ్యక్తికి డబ్బును అప్పుగా ఇస్తున్నారు. ఇది కంపెనీ, మున్సిపాలిటీ లేదా ప్రభుత్వమైనా కావచ్చు.

దానికి బదులుగా, బాండ్ ఉనికిలో ఉన్న కాలానికి మీకు నిర్వచించబడిన వడ్డీ రేటును చెల్లిస్తానని, అదేవిధంగా బాండ్ యొక్క అసలును తిరిగి చెల్లిస్తానని జారీ చేసే వ్యక్తి వాగ్దానం చేస్తాడు. దీనిని ముఖ విలువ లేదా మెచ్యూర్ అయ్యే సమయానికి పార్ వ్యాల్యూ అని కూడా అంటారు, ఒక నిర్ణీత సమయం తరువాత.

పెట్టుబడి సమయంలో మీరు సంపాదించిన వడ్డీతో పాటు మీ అసలును కూడా తిరిగి పొందుతారు.

స్వల్పకాలిక, మధ్యకాలిక పెట్టుబడుల విషయానికి వస్తే బాండ్లు కూడా మెరుగైన ట్రాక్ రికార్డును కలిగి ఉంటాయి.

3. డిపాజిట్ సర్టిఫికెట్​లో పెట్టుబడి పెట్టడం 

డిపాజిట్ ఆఫ్ సర్టిఫికెట్ (CD) అనేది కమర్షియల్ బ్యాంకులు అందించే ఒక రకమైన సేవింగ్స్​ అకౌంట్. ఇది సంప్రదాయ సేవింగ్స్​ అకౌంట్ల కంటే గణనీయంగా ఎక్కువ వడ్డీ రేట్లను చెల్లించేటప్పుడు మీరు పెట్టుబడి పెట్టే డబ్బుకు మీ యాక్సెస్​ను పరిమితం చేస్తుంది.

కాలక్రమేణా డిపాజిట్ విలువ పెరుగుతుంది, అయితే కాలపరిమితి ముగిసేలోగా తొలగించినట్లయితే, అది ఫీజులకు లోబడి ఉండవచ్చు.

ఇది ఒక వారం నుంచి ఒక సంవత్సరం వరకు ఏదైనా కావచ్చు. కనీసం ₹1లక్ష పెట్టుబడి అవసరం అవుతుంది. దీనిని నియంత్రించే బాధ్యత భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI)కు ఉంది.

4. మ్యూచువల్ ఫండ్స్‎లో పెట్టుబడి పెట్టడం

మ్యూచువల్ ఫండ్ అనేది పలువురు పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి స్టాకులు, బాండ్లు, స్వల్పకాలిక లోన్లతో పెట్టుబడి పెట్టే ఒక కార్పొరేషన్.

మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్​ఫోలియో ఫండ్ యొక్క అన్ని హోల్డింగులతో రూపొందించబడింది. మ్యూచువల్ ఫండ్స్​ ఇన్వెస్టర్ల చేత కొనుగోలు చేయబడతాయి.

ప్రతీ షేర్ ఫండ్ యొక్క యాజమాన్యం, ఆదాయంలో భాగానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్​లో ఒక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP)ను ఉపయోగించి క్రమంగా పెట్టుబడి పెట్టడం అనేది ఈక్విటీ పోర్ట్​ఫోలియోను క్రమంగా స్థాపించేటప్పుడు అస్థిరతను తగ్గించడానికి ఒక అద్భుతమైన పద్ధతి.

వైవిధ్యభరితమైన మ్యూచువల్ ఫండ్స్​లో సిప్​ పెట్టుబడులు పెట్టాలి.

5. ఇండెక్స్ ఫండ్స్‎లో పెట్టుబడి పెట్టడం

స్టాక్ మార్కెట్ అంటే భయపడటం మామూలే. కాబట్టి చిన్నగా ప్రారంభించండి. అటువంటి సందర్భంలో ఇండెక్స్ ఫండ్స్ ఒక గొప్ప ఎంపిక.

అనుభవజ్ఞులైన స్టాక్ పికర్‎లను కూడా విజయవంతమైన స్టాకులను ఎంచుకోవడం చాలా కష్టం, కాబట్టి ఎందుకు ఇబ్బంది పడతారు?

మరోవైపు, ఒక ఇండెక్స్ ఫండ్, ప్రస్తుతం స్టాక్ మార్కెట్​లో ట్రేడింగ్ చేసే దాదాపు అన్ని అతిపెద్ద ఈక్విటీలను దాదాపు సమాన మొత్తంలో కొనుగోలు చేస్తుంది.

పెద్ద సంఖ్యలో స్టాక్‎లలో (200-500) పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్​ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇండెక్స్ ఫండ్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

సహజంగానే కొన్ని పెరుగుతాయి, మరికొన్ని పడిపోతాయి. కానీ చారిత్రాత్మకంగా మొదటిది రెండవదాని కంటే ఎక్కువ.

ఇది మరింత సూటిగా, ఖర్చు తక్కువ పెట్టుబడి పద్ధతి.

6. స్టాక్​లు

స్టాక్ అనేది ఒక రకమైన పెట్టుబడి. ఇది కంపెనీ యాజమాన్యంలో కొంత భాగాన్ని ప్రతిబింబిస్తుంది.

కాలక్రమేణా విలువ పెరుగుతుందని నమ్మే పెట్టుబడిదారులు స్టాక్​లను కొనుగోలు చేస్తారు.

మీరు ఒక సంస్థ స్టాక్‎లో షేర్‎ను కొనుగోలు చేసినప్పుడు, మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగాన్ని కొనుగోలు చేస్తున్నారు.

పెట్టుబడిదారులు విలువ పెరుగుతుందని విశ్వసించే సంస్థలలో స్టాక్​లను కొనుగోలు చేస్తారు. ఇది జరిగితే కంపెనీ స్టాక్ విలువ కూడా పెరుగుతుంది.

ఆ తరువాత, స్టాక్​ను లాభం కోసం విక్రయించవచ్చు.

పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడి ఎంపికల కంటే స్టాక్​లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం స్టాక్​లు ఎక్కువ రాబడిని అందిస్తాయి.

భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం; అయినప్పటికీ, ఏదైనా పెట్టుబడి మాదిరిగానే, క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, ప్రణాళిక అవసరం.

ముగింపు

గుర్తుంచుకోండి - మొదట పెట్టుబడి పెట్టండి, తరువాత ఖర్చు చేయండి, చివరిగా పొదుపు చేయండి. చాలామంది మొదట ఖర్చు చేస్తారు, జీతాన్ని అందుకున్న తర్వాత తనిఖీ చేసి పెట్టుబడి పెడతారు.

మంచి వ్యూహం ఏమిటంటే, మొదట పొదుపులో డబ్బును ఉంచడం (అంటే, మీ జీతంలో 25%), తరువాత మిగిలినవాటిని ఖర్చు చేయడం.

ఇక్కడ క్రమశిక్షణ, స్థిరత్వం కీలకం. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహం ఉన్నట్లయితే, ఫైనాన్షియల్ కౌన్సిలర్‎ను నియమించుకోండి.

మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటంటే, డబ్బును సేవింగ్స్​ అకౌంట్ లేదా మీ ఇంటిలో ఉంచరాదు. అన్నివేళలా లిక్విడ్ ఫండ్‎లో పెట్టుబడి పెట్టండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.