Playstore Icon
Download Jar App
Financial Education

మీ పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? జార్ యాప్‎తో ద్రవ్యోల్బణం బారి నుంచి తప్పించుకోండి

December 28, 2022

ప్రతీ సంవత్సరం మన జీవన వ్యయంలో 5-7% పెరుగుదల ఏర్పడటమే ద్రవ్యోల్బణం. ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మీరు దానిని ఎలా ఓడించగలరో తెలుసుకోండి.

ముందుగా సన్నివేశాన్ని సెట్ చేద్దాం. మీరు 1998లో ఒక కప్పు కాఫీ తాగడానికి ఒక కేఫ్​కు వెళుతున్నారు. దీనికి మీకు కేవలం ₹8 ఖర్చు అవుతుంది.

అదే సీన్‎ని ఇప్పటి రోజులకు కట్ చేయండి. మీరు 2021లో అదే కేఫ్​కు తిరిగి వస్తున్నారు, అదే కప్పు కాఫీని ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఇది మీకు ₹196 ఖర్చు అవుతుంది (ఇక్కడ ప్రతి సంవత్సరం 7% ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది).

కేవలం ఒక కప్పు కాఫీపై ధరలో ఈ భారీ పెరుగుదల ద్రవ్యోల్బణం మీకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే.

 

అందువల్ల, ద్రవ్యోల్బణం లేదా ఒక సామాన్యుడి భాషలో 'జీవన వ్యయం' పెరగడం. మనం కొనుగోలు చేసే, వినియోగించే ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది.

భారతదేశంలో, సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు గతంలో సుమారు 7% ఉంది, ఇది 2021లో 5.7%కి తగ్గింది.

కానీ ద్రవ్యోల్బణం అంటే సరిగ్గా ఏంటి?

ద్రవ్యోల్బణం అనేది కాలక్రమేణా వస్తువులు, సేవల ధరల పెరుగుదల, డబ్బు విలువ తగ్గుదలను వివరించడానికి ఉపయోగించే పదం.

 

ఇది మీ కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ₹10 అంటే ఏమిటి, ఇప్పటి పిల్లలకు దాని అర్థం ఏమిటో ఆలోచించండి.

 

ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. కానీ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మీ ఆదాయం పెరుగుతోందా? ప్రతి ఒక్కరి విషయంలో కాదు.

 

ఇక్కడ మధ్య, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలను కొనసాగించడానికి కష్టపడుతున్నారు.

 

ద్రవ్యోల్బణం కారణంగా మీ సాధారణ వ్యయంలో 2 నుంచి 3% పెరుగుదల స్వల్పకాలంలో పెద్దగా కనిపించకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకునేటప్పుడు.

 

ఇది ఆదాయం, వ్యయం మధ్య యుద్ధాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఫలితంగా, భవిష్యత్తు కోసం పొదుపు చేసేటప్పుడు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే పథకాలను మీరు పరిశీలించాలి.

ద్రవ్యోల్బణం ఎందుకు జరుగుతుంది?

 

ద్రవ్యోల్బణం ఒక ప్రధాన ఆర్థిక ముప్పు. ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదపడే అతిపెద్ద అంశం సరఫరా, డిమాండ్‎లో అసమతుల్యత.

సరఫరా పరిమితంగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం అనివార్యం. ఉదాహరణకు, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలను తీసుకోండి.

 

సేంద్రియ కూరగాయలు, పండ్లు కూడా సరఫరా కొరత కారణంగా మరింత ఖరీదైనవిగా మారుతాయి.

 

ముడిపదార్థాలు, వేతనాలు వంటి తయారీ ఖర్చులు పెరగడంతో ధరలు కూడా పెరుగుతాయి. ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు. ఎందుకంటే ప్రజలు వాటికి ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉంటే ఎవరైనా తక్కువ ధరకు ఒక సరుకును ఎందుకు అమ్ముతారు?

 

ధరలను పెంచే మరొక అంశం మితిమీరిన నగదు ప్రవాహం. ఎక్కువగా ముద్రించిన డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది.

ద్రవ్యోల్బణం మీకు, మీ పెట్టుబడులకు ప్రమాదమా?

అవును! మీ పోర్ట్‎ఫోలియోలో ఎక్కువ భాగం స్థిరమైన ఆదాయం అందించే సాధనాలలో పెట్టుబడి పెట్టి ఉంటే, ద్రవ్యోల్బణం మీకు పెద్ద ప్రమాదమే.

 

వాస్తవానికి, మీ వద్ద చాలా నగదు లేదా నగదుకు సమానమైనవి ఉంటే అది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అదేదో సామెత చెప్పినట్లుగా, చక్రవడ్డీ ఏమి తెస్తుందో, ద్రవ్యోల్బణం దాన్ని తీసివేస్తుంది.

మరో విధంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం చక్రవడ్డీకి విలోమం, అంటే వడ్డీని డీకాంపౌండ్ చేయడం.

 

ఎందుకంటే ప్రతీ సంవత్సరం ద్రవ్యోల్బణం మునుపటి సంవత్సరం ద్రవ్యోల్బణం పైన చక్రవడ్డీ లాగా మారుతుంది. ఈ ప్రభావం చక్రవడ్డీని పోలి ఉంటుంది.

 

ఈ క్రింది సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోండి: మీరు సంవత్సరానికి 8% చెల్లించే డిపాజిట్‎లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడతారు. అదే సమయంలో, ధరలు సగటున 8% వార్షిక వేగంతో పెరుగుతున్నాయి.

 

ఈ పరిస్థితుల్లో మీ చక్రవడ్డీతో వచ్చే ద్రవ్యోల్బణానికి సరిపోతాయి.

 

మొత్తానికి మీ పూర్తి అమౌంట్ పెరిగినప్పటికీ, దానితో మీరు సాధించగల మొత్తం ఉండదు. కాబట్టి, పదేళ్ల తర్వాత మీ ₹1 లక్ష ₹2.16 లక్షలకు పెరిగి ఉంటుంది.

 

అయితే మీరు ₹1 లక్షకు కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడు సగటున ₹2.16 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ₹1 లక్ష పదేళ్ల క్రితం ఉన్న కొనుగోలు శక్తిని నష్టపోయింది.

 

మీ స్వంత డబ్బు పరిమాణం పెరగడం కేవలం ఎండమావి మాత్రమే. ఇది ధరలు పెరగడం వల్ల పూర్తిగా రద్దు చేయబడుతుంది.

 

ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం విస్తృతమైన సమస్య. ప్రజలు నామమాత్రపు పదాల్లో ఆలోచిస్తారు. ద్రవ్యోల్బణం యొక్క భవిష్యత్తు ప్రభావాన్ని అంతర్గతం చేయడం కష్టం.

 

వాస్తవానికి పరిష్కారం ఏమిటంటే తక్కువ ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థగా మారాలి, కానీ అది కుదరట్లేదు. కాబట్టి మీలాంటి పొదుపరులు, పెట్టుబడిదారులు అన్ని వేళలా ద్రవ్యోల్బణం కోసం మానసికంగా సిద్ధమై ఉండాలి. ఎందుకంటే దానికి వేరే పరిష్కారం లేదు. ద్రవ్యోల్బణం అనివార్యం.

మరి మీరు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఓడించగలరు?

 

ద్రవ్యోల్బణం మీ పెట్టుబడులన్నింటినీ ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించడం అసాధ్యం. కానీ మీరు దానిని ఓడించడానికి ఆప్షన్లను వెతకవచ్చు:

 

1. మీ నెలవారీ బడ్జెట్‎ని మరోసారి చూసి పరీక్షించండి:

మీరు మీ ఇంటి బడ్జెట్‎ను తిరిగి లెక్కించాల్సి ఉంటుంది. అవసరాలు, అదనపు ఖర్చులు రెండింటి కొరకు మీ ఖర్చులను పరిశీలించండి.

 

మీ ఆప్షన్లను పరిశీలించండి. మీ ఖర్చులను ఎక్కడెక్కడ తగ్గించవచ్చో తనిఖీ చేయండి. బయట తినడం తగ్గించండి. లేదా కొన్ని సబ్‎స్క్రిప్షన్ సర్వీసులను తొలగించండి. మీకు ఏది సరిపోతుందో అది మాత్రమే పెట్టుకోండి.

 

మీ సంపాదనలో కొంత శాతంగా మీ ఇంటి బడ్జెట్‎ను నిర్వహించడం సరైన ట్రాక్‎లో ఉండటానికి మరొక విధానం.

ఉదాహరణకు, మీరు ₹50,000 సంపాదించినప్పుడు, మీ ఇంటి ఖర్చులకు ₹30,000 ఖర్చు చేస్తే, అది మీ జీతంలో 60% అవుతుంది.

 

విచక్షణతో ఖర్చులను తగ్గించడం ద్వారా, మీరు మీ ఇంటి ఖర్చులను మీ ఆదాయంలో 60% వద్ద ఉంచగలగాలి.

 

అలాగే, మీ ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు, ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి.

2. మ్యూచువల్ ఫండ్స్/షేర్లలో పెట్టుబడి పెట్టండి:

 

ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడానికి ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటి. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోగలవు. లాభాలను అందించచగలవు. అందువల్ల ఇవి పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీలు.

 

స్టాక్స్‎లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఇన్వెస్టర్లు అందరికీ నేర్పించబడుతుంది. అయితే ద్రవ్యోల్బణం ఎక్కువ ప్రమాదం అని గ్రహించడానికి కొంచెం ఆలోచన మాత్రమే పడుతుంది.

 

ద్రవ్యోల్బణంతో కొనసాగడానికి, ఆపై నిజమైన లాభాలను సంపాదించడానికి, మీరు ద్రవ్యోల్బణంతో పాటు పెరిగే దానిలో పెట్టుబడి పెట్టాలి.

‍మీరు ఎక్కువ కాలం పాటు సిప్​ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‎మెంట్ ప్లాన్)లో డబ్బును ఉంచవచ్చు. ఇది మార్కెట్ అస్థిరత, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది.

 

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సరిపోయే బలమైన రాబడిని అందించే అనేక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.

3. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టండి:

బంగారం, వెండి వంటి సరుకులు చారిత్రాత్మకంగా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టలుగా ఉపయోగించబడ్డాయని మనందరికీ తెలుసు. కరెన్సీ విలువ పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్లు సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అంటే బంగారంలో.

 

ఇది ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. ఒక ఇన్వెస్టర్​ యొక్క పోర్ట్‎ఫోలియోలో బంగారం 10-20% వాటా కలిగి ఉండాలి.

 

దీనిని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలి. ఒకవేళ మీకు ఇప్పటికే బంగారం పెట్టుబడిగా లేనట్లయితే, గోల్డ్ ఈటీఎఫ్​లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ సేవింగ్స్ స్కీములు లేదా అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ఆప్షన్ డిజిటల్ గోల్డ్‎లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు క్రమంగా మీ హోల్డింగ్‎లను పెంచుకోవచ్చు.

 

మీ డబ్బును ఆటోమేటిక్‎గా డిజిటల్ గోల్డ్‎లో పెట్టుబడి పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం బారిన పడకుండా ఉంచడానికి జార్ మీకు సహాయపడుతుంది. నిరంతరం ద్రవ్యోల్బణం నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

 

మీ ఆన్‎లైన్ లావాదేవీల నుంచి మిగిలే చిల్లరను పెట్టుబడి పెట్టడం ద్వారా ఇది ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. అందువల్ల పెట్టుబడి పెట్టడం మీకు భారంగా అనిపించదు.

 

ఇది మీ జీవితంలో ఒక భాగం అవుతుంది. ద్రవ్యోల్బణం కంటే ముందు ఉండండి. చిన్న అడుగులు వేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కొట్టే రాబడిని ఆస్వాదించండి - జార్ యాప్ ద్వారా మీ డబ్బును గోల్డ్‎లో ఇన్వెస్ట్​ చేయడం ప్రారంభించండి.

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.