Playstore Icon
Download Jar App
Digital Gold

భౌతిక రూపంలో బంగారం పొందేందుకు డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయడమనేది ఒక కొత్త మార్గం - జార్

December 28, 2022

అసలు బంగారం చరిత్ర, పూర్వాపరాలు ఏమిటి? ఇది ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది డిజిటలైజేషన్ వైపు ఎలా మారింది? అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

భారతదేశంలో బంగారానికి చాలా చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. ఇది మన ఇళ్లలో, భారతీయుల హృదయాల్లో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది మనకు ఒక పెట్టుబడి కంటే కూడా ఎక్కువే.

బంగారం ప్రపంచంలోని ఎక్కడి వారినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. దానికున్న ఆకర్షణ అటువంటిది. రానురాను జనానికి బంగారం మీద ఉన్న మక్కువ పెరుగుతూ వస్తోంది.

అంతటా బంగారం వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ధన్​తేరాస్, దీపావళి వంటి ప్రత్యేక రోజులలో భారతీయులు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. బంగారాన్ని కొనడమనేది వారి జీవితాల్లో ప్రత్యేకమైనదిగా మార్చుకుంటున్నారు. వారి నగరం లేదా గ్రామంలో ఉన్న బంగారం ధరలను వారు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు.

ఈ విధంగా దేశవ్యాప్తంగా బంగారం కొనేందుకు అనేకమంది కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో దాదాపు 23,000 నుంచి 24,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా పచ్చి నిజం. ఈ బంగారం ఎక్కువగా గృహస్తుల వద్దే ఉంది.

కానీ ఈ అత్యంత విలువైన లోహం యొక్క చరిత్ర ఏమిటి? ఇది ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను ఇక్కడ కూలంకషంగా చర్చిద్దాం.

బంగారం యొక్క చరిత్ర

మానవ నాగరికత ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచే విభిన్నమైన విషయాల​ను గుర్తించి వాటిలో కొన్నింటిని డబ్బుగా పిలవడం ప్రారంభించారు.

మొదటగా వస్తు మార్పిడి విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారం కుదిరినప్పుడు వారు 2 వస్తువులను పరస్పరం మార్పిడి చేసుకునే వారు.

కానీ ఈ విధానంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతీ వస్తువు ద్రవ్య విలువ శ్రమను బట్టి మారుతూ ఉండేది.

ఉదాహరణకు చూసుకుంటే.. గోధుమలు సాగు చేయడం, క్షవరం చేయడం రెండు వేర్వేరు వస్తువులు. వీటి రెండింటి విలువ అస్సలు సరిపోలదు.

షెల్స్​ను డబ్బుగా చేసేందుకు మానవులు చాలా ప్రయత్నించారు. చూసేందుకు చాలా చక్కగా ఉంటాయి. కానీ, అవి చాలా అరుదుగా లభిస్తాయి. దీంతో వాటిని డబ్బుగా మార్చడం చాలా కష్టతరమైంది.

ఆ తర్వాత బంగారం వాడుకలోకి వచ్చింది. బంగారాన్ని మొదటిసారిగా క్రీస్తు పూర్వం 4000వ సంవత్సరంలో వెలికి తీసినట్లు ఆధారాలు ఉన్నాయి. తొలినాళ్లలో వెలికి తీసిన బంగారు వస్తువులు అపురూపమైనవి.

బంగారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిని కలిగి ఉంది. దీని సౌందర్యం, లిక్విడిటీ, ఆర్థిక విలువ కారణంగా ఇది చాలా విలువైన లోహంగా పేరు పొందింది.

వివిధ రకాలైన పరిశ్రమల్లో కూడా ఇది సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.

బంగారాన్ని పట్టుకున్న వ్యక్తికి కరెంట్ షాక్​ ఏం కొట్టదు, విషం ఎక్కదు. దానికి మంటలు అంటుకొని కాలిపోదు.

దీనిని అధికంగా ఉత్పత్తి చేయడం అనేక సమస్యలతో కూడుకున్నది. బంగారం నాణేలు, కడ్డీలు తయారు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది.

బంగారం అనేది కరెన్సీగా మారడానికి చాలా రోజుల సమయం పట్టింది. చాలా రోజుల పాటు బంగారాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించారు.

బంగారం విలువను రక్షించేందుకు తొలినాళ్లలో నాగరిక మానవులు స్వచ్ఛత, కొలమానాలను ఏర్పాటు చేశారు.

వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ ప్రకారం..  ప్రపంచంలోని చాలా కరెన్సీలు 19వ శతాబ్దం చివరలో గోల్డ్​ స్టాండర్డ్ కింద లాక్ చేయబడ్డాయి. ఇవి ఒక స్థిరమైన ధరకు ఔన్సులుగా లాక్ చేయబడ్డాయి. దాదాపు 100 సంవత్సరాలపాటు ఇది ఇలాగే కొనసాగింది.

కానీ, గోల్డ్​ స్టాండర్డ్ అంటే ఏమిటి?

గోల్డ్​ స్టాండర్డ్​ అనేది కరెన్సీ విలువను నిర్ణయించేదుకు బంగారాన్ని ఉపయోగించే ఒక మార్గం. గోల్డ్​ స్టాండర్డ్​ ఒక దేశ కరెన్సీ విలువను బట్టి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు లేదా విక్రయించేందుకు ధరను నిర్ణయిస్తుంది.

భారతదేశం గోల్డ్​ స్టాండర్డ్​లను అంగీకరించి ఒక గ్రాము బంగారం ధరను  రూ. 25,000గా నిర్ణయిస్తే.. భారతీయ రూపాయి విలువ ఒక గ్రాము బంగారంలో 1/25,000వ వంతు ఉంటుంది.

గోల్డ్​ స్టాండర్డ్​ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

●     బంగారం ధరలను స్థిరంగా ఉంచుతుంది.

●     ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం ఒత్తిడులు దూరం చేయబడతాయి.

●     దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుంది.

●     లావాదేవీలు చేసేందుకు బంగారు నాణేలు లేదా బులియన్​లను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

●     ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు కావాల్సిన విశ్వసనీయతను కలిగిస్తుంది.

అయితే, ప్రస్తుత రోజుల్లో గోల్డ్​ స్టాండర్డ్​ను ఎవరూ ఉపయోగించడం లేదు.

గోల్డ్​ స్టాండర్డ్​ ముగిసిపోయిన తర్వాత ఆర్థిక అస్థిరత్వం, ద్రవ్యోల్బణం ఏర్పడింది.

21వ శతాబ్దంలోని మొదటి దశాబ్దంలో మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకోవడంతో బంగారం ధర పెరగడం మొదలైంది.

గోల్డ్​ సాండర్డ్స్​​ అనేవి 19వ, 20వ శతాబ్దాల్లో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ గోల్డ్​ స్టాండర్డ్స్​లో అంతర్గత లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ అవి ఆ కాలంలో చాలా జనాదరణ పొందాయి.

బంగారం కలిగి ఉంటే డబ్బును కలిగి ఉన్నట్లే అని చాలా మంది గుర్తించరు. ఇది ఎక్కువగా అమెరికన్​ డాలర్​తో ముడిపడి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని అమెరికన్​ డాలర్లలోనే లెక్కిస్తారు.

డాలర్, బంగారం ధరలు దీర్ఘకాలిక వ్యతిరేక సంబంధాన్ని కలిగి ఉంటాయి. బంగారం ధర కేవలం మారకం రేటు మాత్రమే అని మనం భావించినప్పుడు మనం ఈ అంశాలను తప్పనిసరిగా గమనించాలి.

అమెరికన్ డాలర్​ను ఎలాగైతే మనం జపనీస్ యెన్​​లా మార్చుకుంటామో అలాగే పేపర్ కరెన్సీతో బంగారాన్ని ట్రేడ్ చేయవచ్చు. డబ్బును వృద్ధి చేయడంలో బంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

నేటి రోజుల్లో ముఖ్యంగా నాలుగు అంశాలు బంగారం డిమాండ్​ పెరుగుదలకు కారణం అవుతున్నాయి. అవి 1. ఆభరణాలు, 2. పెట్టుబడులు, 3. రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, 4. టెక్నాలజీ (సాంకేతికత)

ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన కాలంలో కూడా బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గలేదు. చాలా సంవత్సరాల పాటు అది తన విలువను కోల్పోకుండా అలాగే ఉంది.

భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (MCX) లో బంగారం వ్యాపారం జరుగుతుంది.

బంగారం ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపిస్తుంది?

బంగారం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏదైనా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తప్పక చూపిస్తుంది. అది మైనింగ్ దశలోనైనా కావొచ్చు, శుద్ధి చేసే దశలోనైనా కావొచ్చు, ఉత్పత్తి దశలోనైనా, వ్యాపార దశలోనైనా కావొచ్చు. ఆ కారణాలను మనం ఇప్పుడు చర్చిద్దాం.

1. బంగారం దిగుమతులు కరెన్సీ విలువను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఒక దేశం కరెన్సీ విలువ దాని ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడుతుంది. దేశం ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశపు కరెన్సీ బలపడుతుంది.

అదే విధంగా ఒక దేశం ఎగుమతి చేసే వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటే ఆ దేశ కరెన్సీ విలువ తగ్గిపోతుంది.

బంగారాన్ని ఎగుమతి చేసే దేశాల కరెన్సీ విలువ కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. దానికి కారణం బంగారం ధరలు పెరగడమే.

బంగారం ధరలు పెరిగినప్పుడు ఎగుమతి చేసే దేశాల వాణిజ్య విలువలు పెరుగుతాయి. అందువలన ఆ దేశ కరెన్సీ విలువ బలపడుతుంది. అదేవిధంగా దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీ విలువ క్షీణిస్తూ ఉంటుంది.

ఉదాహరణకు, ఈ రోజు బంగారం ధర పెరిగిందని అనుకుందాం. దాని ఫలితంగా భారతదేశ రూపాయి విలువ పతనమవుతుంది. ఎందుకంటే బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి వరుసలో ఉంటుంది.

2. వడ్డీ రేటు

వడ్డీ రేట్లు బంగారంతో ముడిపడి ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు బంగారాన్ని బాండ్లు, ఫిక్స్​డ్​ డిపాజిట్లకు మంచి ప్రత్యామ్నాయంగా మారుస్తాయి. ఒకవేళ ధరలు పెరిగితే వీటితో చాలా కోల్పోవాల్సి వస్తుంది.

అధిక వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. ఎటువంటి ఆదాయ ఉత్పత్తి లేని బంగారం కంటే కూడా బాండ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునే పెట్టుబడిదారులకు మరింత నష్టాన్ని చేకూరుస్తుంది.

3. ద్రవ్యోల్బణం.

స్టాక్​లు, బాండ్ల వంటి ఆస్తులు ద్రవ్యోల్బణం వలన అధికంగా ప్రభావితం అవుతున్నందువల్ల బంగారం విలువ మరింతగా పెరిగిపోయింది.

వివిధ రకాల పెట్టుబడి సాధనాలు ద్రవ్యోల్బణం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి చాలా మంది బంగారం మీద పెట్టుబడులను చాలా సురక్షితమైనవిగా భావిస్తారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇది భద్రతను ఇస్తుంది. ప్రపంచ యుద్ధం వచ్చినా కానీ, ఆర్థిక సంక్షోభం తలెత్తినా కానీ బంగారం మీద పెట్టుబడులు మాత్రం సురక్షితంగా ఉంటాయి.

సాధారణంగా సమాజంలోని ఇన్వెస్టర్లు కరెన్సీ మీద విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు బంగారం వైపు మళ్లుతారు. ఇది బంగారం ధరలు మరింత పెరిగేలా చేస్తుంది.

ఇవి మరియు ఇతర కారకాలు ఒకే సమయంలో వ్యతిరేక దిశలో కదులుతాయనే వాస్తవం.. ఆర్థిక పరిస్థితులు, బంగారం ధరల మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడం ఎంత కష్టమో తెలియజేస్తుంది.

బంగారం మార్కెట్ ఎలా పనిచేస్తుందని మీరు బేసిక్ ఫండమెంటల్స్​ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా తెలుసుకోవడం వలన మీరు సమర్థవంతంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

4. మార్కెట్ల కొరకు కరెన్సీ

బంగారం ధరలు ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికన్​ డాలర్ విలువలో మార్పులను తెస్తాయి.

డాలర్ బలంగా ఉన్నప్పటికీ.. డాలర్ పరంగా చూసుకున్నప్పుడు బంగారం ధరలు మారకపోయినా కానీ, కరెన్సీ విలువ పడిపోయిన వివిధ దేశాలలో బంగారం ధరలు పెరుగుతాయి.

డాలర్ పరంగా బంగారం ధరల విషయంలో ఒత్తిడిని, డిమాండ్​ను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. డాలర్ బలహీనపడినపుడు.. విదేశీ కరెన్సీ ఖర్చులు తగ్గి బంగారాన్ని మరింతగా కొనుగోలు చేస్తారు. దీని వలన డిమాండ్​తో పాటు బంగారం ధరలు పెరుగుతాయి.

5. బంగారం మైనింగ్ (తవ్వకాలు)

బంగారు గనుల అభివృద్ధి ద్వారా భారతదేశం బాగా అభివృద్ధి చెందింది. మైనింగ్ అనేది మౌలిక రంగాల అభివృద్ధికి, వివిధ రకాల రంగాల నిర్వహణకు బాగా ఉపయోగపడుతుంది. ఇవి గని జీవితానికి అవతల ఉంటాయి.

ఈ సమయంలో దేశంలోని బంగారం మైనింగ్ వ్యాపారం ప్రధానమైనదేమీ కాదు. (అనిశ్చితితో కూడుకుని ఉంటుంది)

2015లో భారతదేశం దాదాపుగా 45,000 ఔన్సుల బంగారాన్ని తవ్వి తీసింది. ఉపఖండంలో ఆ సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి చేయబడిన బంగారం (రాగి మైనింగ్​లో వెలువడిన బంగారంతో కలుపుకొని) 1.5 టన్నుల కంటే తక్కువగానే ఉంటుంది.

6. బంగారం ఉత్పత్తి

భారతదేశంలో ప్రస్తుతం 5 నుంచి 10 శాతం బంగారం తయారీ రంగం ఆర్గనైజ్​డ్​ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్​గా వర్గీకరించబడింది. అయితే ఇవి పదేళ్ల క్రితం నుంచి వినబడటం లేదు.

భారతదేశంలో దాదాపు 65 శాతం బంగారు ఆభరణాలు చేతితో తయారు చేయబడినవే. ఇప్పటికీ బంగారు ఆభరణాలు చేసేవారు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులతో నడిచే దుకాణాలే ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

భారతదేశంలో బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపిస్తున్నాయి. చమురు దిగుమతులు కరెంట్​ అకౌంట్​ లోటును (CAD) ఎక్కువగా ప్రభావితం చేసినప్పటికీ బంగారం రెండో స్థానంలో ఉంది.

ఒక దేశం మొత్తం దిగుమతులు, బదిలీలు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దేశం కరెంట్ అకౌంట్ డెఫిసిట్​ (CAD)లో ఉందని చెబుతారు.

7. విస్తరిస్తున్న గోల్డ్​ లోన్ ఇండస్ట్రీ

బంగారాన్ని తాకట్టు పెట్టే పద్ధతి చాలా రోజులుగా భారతీయ బంగారం​ మార్కెట్​లో ఉంది.

ఎవరైనా సరే బంగారాన్ని తాకట్టుగా పెట్టుకొని రుణాలను అందజేస్తున్నారు. ఆధీకృత బ్యాంకులైనా, లేక నాన్ బ్యాంకింగ్ సంస్థలైనా, వ్యక్తులైనా ఇలా బంగారాన్ని తాకట్టు పెట్టుకునే వారు దేశంలో చాలా మందే ఉన్నారు.

ఇది చాలా పెద్ద స్థాయిలోనే ప్రభావాన్ని చూపుతోంది. ఉదాహరణకు, 75 శాతం లోన్ టూ వ్యాల్యూ (LTV) సీలింగ్​ను పునరుద్ధరించేందుకు దేశంలోని బంగారం సంస్థలు ప్రభుత్వాన్ని ఒప్పించాయి. ఇందులో ఇవి విజయవంతం అయ్యాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని కూడా పునరుద్ధరించుకున్నాయి.

డిజిటలైజేషన్ వైపు పరుగులు

ప్రస్తుతం మన సమాజంలో కేవలం 8 శాతం డబ్బు మాత్రమే భౌతికమైనది. మిగతా 92 శాతం డిజిటల్ రూపంలోనే ఉంది.

డిజిటల్ గోల్డ్​ అనేది దినదినాభివృద్ధి చెందుతోంది. భౌతిక రూపంలో (బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాలు) వంటి వాటి నుంచి ఇప్పుడు ఈటీఎఫ్​లు, ఎస్​జీబీల వరకు చేరింది. తక్కువ మొత్తంలో కూడా డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయొచ్చు. దీనికి కేవలం కొన్ని సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.

స్మార్ట్​ ఫోన్లు, ఈ-వ్యాలెట్లకు ఈ విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. వీటి వలన ఇన్వెస్టర్లు చాలా సులభంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సులభ విధానాల వలన పెట్టుబడి అలవాట్లు పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ గోల్డ్​ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం అనుకున్నంతగా పెరగడం లేదు. ఇక్కడ ఇప్పటికీ బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలను చేతులలో పట్టుకుని బహుమతులుగా అందిస్తున్నారు.

MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సేఫ్ గోల్డ్​ మరియు ఆగ్​మౌంట్ వంటి బంగారం​ బ్యాంకుల్లో మీ బంగారం నిల్వ చేయబడుతుంది. అంతేకాకుండా స్మార్ట్​ ఫోన్ వినియోగదారులు కొనుగోలు, లేదా విక్రయం, లేదా బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ఇవి అనుమతిస్తాయి.

బంగారం మీద ఆధారపడే ఆర్థిక ఉత్పత్తులైన గోల్డ్​ అక్యూమలేషన్ ప్లాన్స్ (GAP) వంటివి వినియోగదారులు 0.1 గ్రాముల కంటే తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కూడా అనుమతిస్తాయి. వీటిని భౌతికం​గా మార్పిడి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

అందరికీ అర్థమయ్యేలా సులభమైన మాటల్లో చెప్పాలంటే డిజిటల్ గోల్డ్​ అనేది బంగారాన్ని ఆన్​లైన్ ద్వారా కొనుగోలు చేయడం. ఇది ఈ యుగపు పద్ధతి. రోజులో 24 గంటలపాటు, వారంలో 7 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా ఇల్లు, కార్యాలయం ఎక్కడినుంచైనా సరే బంగారాన్ని సులభంగా కొనంచ్చు, అమ్మేయంచ్చు.

భారతదేశంలోని యువత ఈ సేవింగ్స్ ప్రోగ్రాముల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. గోల్డ్​ ఆధారిత బాండ్లు, వివిధ రకాల వెబ్​సైట్లు బంగారం నాణేలు, బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నాయి. వీటిని భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చాలా తక్కువ ధరలో తీసుకుపోవచ్చు.

బంగారం మీద కోరిక ఉన్నా కానీ బంగారానికి సరిపోయేంత డబ్బు పోగయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలా ఏమీ లేదు. పైగా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

మీరు కొనుగోలు చేసే ప్రతి గ్రాము బంగారం భారతదేశంలోని మూడు బంగారం బ్యాంకులైన ఆగ్​మౌంట్​ | MMTC - PAMP | సేఫ్ గోల్డ్ లలో ఏదో ఒకదానిలో మీ పేరిట నిల్వ చేయబడుతుంది. 

జార్ యాప్​లో మీరు నచ్చిన విధంగా పెట్టుబడులు పెట్టవచ్చు. కేవలం ఒక బటన్​ను క్లిక్ చేయడం ద్వారా సులభం​గా పెట్టుబడులు పెట్టవచ్చు, విక్రయించవచ్చు, లేదా మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని ఇంటికే డెలివరీ చేయించుకోవచ్చు. అంతేకాకుండా డిజిటల్ గోల్డ్​ కొనేందుకు ఎటువంటి పరిమితులు లేవు. కావాలంటే మీరు రూ. 1 తో కూడా డిజిటల్ గోల్డ్​ కొనవచ్చు.

● డిజిటల్ గోల్డ్​ను ట్రాక్ చేయడం చాలా సులభం. అంతేగాక రోజులో ఎప్పుడైనా కూడా ట్రాక్ చేయవచ్చు.

● ఇది అత్యధిక లిక్విడిటీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు, లేదా విక్రయించవచ్చు.

● మీకు నచ్చిన వారికి బంగారాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.

● బంగారం ఉంటే ద్రవ్యోల్బణం చింత ఉండదు. అంతేగాక బంగారం మీద రుణాలు కూడా తీసుకోవచ్చు.

● దాదాపు గడిచిన 92 సంవత్సరాల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో బంగారానికి ఒక రకమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. పైగా బంగారం మీద పెట్టే పెట్టుబడులు అధిక రాబడులను ఇస్తాయి.

జార్ అనేది ఒక డైలీ గోల్డ్​ సేవింగ్స్ యాప్. మీరు ఆన్​లైన్​లో గడిపిన ప్రతీసారి ఇది మీ అకౌంట్​ నుంచి కొంత మొత్తాన్ని డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడిగా పెడుతుంది. ఇది మీరు డబ్బును పొదుపు చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

ఎలాగంటే ఇది ఒక డిజిటల్ పిగ్గీ బ్యాంకులాగా పనిచేస్తుంది. కేవలం 45 సెకన్ల కంటే తక్కువ సమయంలో మీరు జార్ యాప్ ఖాతాను తెరవవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్​లెస్​గా ఉంటుంది. జార్ యాప్​లో సేవింగ్స్ చేసేందుకు ఎటువంటి కేవైసీ కూడా అవసరం లేదు.

 

● ఇక్కడ మీరు ఏ సమయంలోనైనా బంగారాన్ని విక్రయించవచ్చు. మీ ఇంటి వద్దే కూర్చొని మీ బ్యాంకు ఖాతాలోనికి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

● ఇక్కడ ఎటువంటి కనీస కాలపరిమితి అంటూ ఉండదు.

● ఇందులో మీరు గేమ్స్​ను ఆడవచ్చు, తద్వారా ఉచితంగా మీ సేవింగ్స్​ను పెంచుకునే అవకాశం ఉంటుంది.

● జార్ యాప్​ మీ సేవింగ్స్​ని ఆటోమేట్ చేస్తుంది. అంతేకాకుండా రోజూవారీగా మీ పొదుపులను క్రమపద్ధతిలో ఉంచుతుంది.

● సెబీ గుర్తింపు పొందిన బ్యాంకు ఖాతా ఉన్న ఏ భారతీయుడైనా సరే జార్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.

● భౌతిక బంగారమైతే ఎవరైనా ఎత్తుకొని పోతారనే చింత ఉంటుంది. కానీ డిజిటల్ గోల్డ్​ విషయంలో ఆ విధమైన చింత ఉండదు. లాకర్ ఫీజుల భాద కూడా ఉండదు.

● మీ బంగారం ప్రపంచస్థాయి లాకర్లలో ఉచితంగా నిల్వ చేయబడుతుంది.

బంగారం విలువ ఏంటో, దాని సత్తా ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది. మరి మీరు దానిలో పెట్టుబడులు ఎందుకు పెట్టకూడదు. దీనికి కేవలం కొన్ని సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈరోజే మీ డిజిటల్ గోల్డ్​ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇప్పుడే జార్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని ప్రారంభించండి.

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.