మీ పిల్లలకు డబ్బు గురించి చెప్పడానికి, ఆర్థిక జ్ఞానాన్ని నేర్పించడానికి ఉపయోగపడే మంచి ఆర్థిక అంశాలు, కార్యకలాపాలు
నాకు బిల్లులు ఎలా చేయాలో, ట్యాక్స్ అంటే ఏమిటో చిన్నప్పుడే చెప్పి ఉంటే బాగుండేది.
మీరు ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? లేదంటే మీ అమ్మానాన్న మీకు బడ్జెట్, పొదుపు, క్రెడిట్ కార్డుల గురించి, ఇంకా పెద్ద విషయాలైన ఇన్వెస్టింగ్, తనఖాలు, ట్యాక్స్ ఎలా మేనేజ్ చేయాలి, జీతం మాట్లాడుకోవడం, పదవీ విరమణ కోసం డబ్బు పొదుపు చేసుకోవడం లాంటి వాటి గురించి చెబితే బాగుండేది అని అనుకున్నారా?
మీరు ఇవి చదువుతున్నారంటే మీకు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ నేర్పడం ఎంత ముఖ్యమో తెలిసిందని అర్థం.
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. కేవలం మీ ప్రేమ, ఆప్యాయతలే వాళ్ళ మీద ప్రభావం చూపించవు. మంచికైనా చెడుకైనా మీరు మీ ఆర్థిక విషయాలను ఎలా మేనేజ్ చేసుకుంటారో కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు.
అయినా కూడా, డబ్బు గురించి తగినంతగా ముందునుంచే నేర్పించకపోతే - లేదా కావలసినంత నేర్పించకపోతే – రాబోయే తరాల వారు ఆర్ధిక నిరక్షరాస్యతతో పోరాడవలసి వస్తుంది.
దీనికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు:
- పిల్లలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం కష్టమని తల్లిదండ్రులకు అనిపించడం.
- అది పిల్లలకు అనవసరమైనది అనుకోవడం.
- పిల్లలకు చెప్పేంత గొప్పగా తమకే అర్థమవలేదని తల్లిదండ్రులకు అనిపించడం.
- తమ ఆర్ధిక పరిస్థితి తమ పిల్లలకు చెప్పగలిగే స్థాయిలో లేదని తల్లిదండ్రులు భావించడం.
డబ్బు గురించి మీ పిల్లలతో సరైన సంభాషణలు చేయడం ముఖ్యం.
మీరు వాళ్లకు నేర్పడం ఎప్పుడు మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికి ఒక వయసు అంటూ ఉండదు; కానీ, మీరు ఎంత త్వరగా వారికి డబ్బు గురించి నేర్పించడం మొదలు పెడితే, వారు తమ జీవితంలో మంచి ఆర్థిక అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉంది.
మీ పిల్లల ఆర్థిక అక్షరాస్యత యొక్క పునాదిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి కొన్ని ఆర్థిక అంశాలను, కార్యకలాపాలను వయస్సుల వారీగా ఇచ్చాము:
మీ 3 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఆర్థిక విషయాలను ఎలా చెప్పాలి?
- మొత్తం నాణేల్లోనే ఉంది: మీ పిల్లలతో కలిసి డబ్బులు లెక్కపెట్టడానికి కొంత సమయం కేటాయించండి. రకరకాల నాణేలు, రూపాయి మొత్తాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. ప్రతీ నాణెం విలువను చెప్పి, చిన్న చిన్న లెక్కలను నాణేలకు ఎలా అనువర్తించాలో చెప్పండి.
- పిగ్గీ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం: పిల్లలకు చిల్లర ఇస్తూ, వాళ్ళనే పిగ్గీ బ్యాంకులో వేయిమనండి. వాళ్ళ షెల్ఫ్‌లోని పిగ్గీ బ్యాంకులో కొద్ది కొద్దిగా డబ్బులు పెరగడం చూస్తూ ఉంటే వాళ్లకు డబ్బు ఎలా ఆదుకోవాలో తెలుస్తుంది.
- అవసరాలు, కోరికలు: ‘వద్దు’ అని అనుకోవడం బాగా అలవాటు చేసుకోండి. వాళ్లకు కావలసినది ఏదైనా మీరు వద్దన్న సందర్భాలలో అవసరాలు, కోరికల మధ్య తేడా ఏమిటో పిల్లలకు వివరించి చెప్పండి. మీరు మీ పిల్లలను బాధ పెట్టడం కోసం ‘వద్దు’ అని చెప్పడం లేదు. అది కోరిక కాబట్టి, అవసరం కాదు కాబట్టి మీరు ‘వద్దు’ అని చెబుతున్నారు.
- మొక్కను పెంచడం, సంరక్షించడం: మీ పిల్లలకు తోటలో కొంతభాగాన్ని గానీ, ఒక మొక్కని గానీ సంరక్షించే పనిని అప్పగించండి. దేనినైనా ప్రతిరోజూ సంరక్షించడం అనేది, పొదుపు చేయడం అంటే ఏమిటో పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటో పిల్లలకు అర్థమవ్వడానికి సహాయపడుతుంది.
మీ 7 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు ఆర్థిక విషయాలను ఎలా చెప్పాలి?
- వాళ్ళ కోరికలను ఒక కళగా మార్చండి: వాళ్ళు కొనుక్కోవాలనుకునే వస్తువుల బొమ్మలు వేయమని, లేదా వాటిని కొలేజ్ చేయమని చెప్పండి. వాళ్ళు ఏ ఆర్ట్ చేస్తే దానిలోని వస్తువు కోసం పొదుపు చేసుకోమని చెప్పండి. ఆలస్యంగా సంతృప్తి పొందడాన్ని నేర్పడమే ఇక్కడ పాఠం. కోరుకున్నదాన్ని అప్పటికప్పుడే కొనుక్కోవడం ఎంతో ఉత్సాహంగా అనిపించినా, దానికోసం కష్టపడి పనిచేసి దాన్ని పొందితే మరింత బాగుంటుందని వాళ్లకు చెప్పండి.
- సూపర్ మార్కెట్‌కు వెళ్ళడం ఒక సరదా: మీ పిల్లలకు ఒక బడ్జెట్ ఇచ్చి కావలసిన జాబితాలోని వస్తువులను కొనుమని సవాలు విసరండి. ప్రతీవారం మీరు చెప్పిన బడ్జెట్ దాటకుండా జాబితాలోని వస్తువులన్నింటినీ ఎలా కొనాలో వాళ్ళను తెలుసుకోమని చెప్పండి.
- వాళ్ళతో సిమ్యులేషన్ గేమ్స్ ఆడండి: సిమ్స్, లైఫ్ అండ్ మోనోపొలి సిమ్యులేషన్ గేమ్స్‌లో లో స్టేక్ సినారియోలో కష్టతరమైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో బాగా తెలుస్తుంది.
మీ 11 నుంచి 13 సంవత్సరాలలోపు పిల్లలకు ఆర్థిక విషయాలను ఎలా చెప్పాలి?
- వాళ్ళను బ్యాంకుకు తీసుకెళ్ళండి: మీ పిల్లలకు మీ పర్యవేక్షణలో ఉండే సేవింగ్స్ అకౌంట్ తెరవండి. చాలా బ్యాంకులు మీ పేరు మీద పిల్లల కోసం అకౌంట్ తెరుస్తాయి. మనీ మేనేజ్మెంట్ గురించి పిల్లలకు చెప్పడం కోసం ఎన్నో వర్చువల్ బ్యాంక్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీ పిల్లలకు వాళ్ళ అకౌంట్ ఎలా నడపాలో నేర్పడానికి వాళ్ళతో కలిసి పనిచేయండి.
- చక్రవడ్డీ చేసే మాయ: మీకు చక్రవడ్డీ వచ్చే సేవింగ్స్ అకౌంట్ గానీ వేరే ఏదైనా అకౌంట్ గానీ ఉంటే, మీ పిల్లలకు మీకు డబ్బులు ఎలా వచ్చాయో, మీరు ఆ అకౌంట్లో డబ్బు ఎందుకు పెట్టారో, మీరు దాన్ని ఎందుకు తెరిచారో చెప్పండి. చివరికి మీకు ఎంత డబ్బు వస్తుందో చెప్పండి. మీ పిల్లలకు వాళ్ళ అకౌంట్ ఎలా నడపాలో నేర్పడానికి వాళ్ళతో కలిసి పనిచేయండి.
- క్రెడిట్ కార్డులు డబ్బు కాదు: చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు 13 ఏళ్ళ పిల్లలకు కూడా అధికారికంగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. మీరు చెప్పకపోయి ఉంటే వాళ్లకు క్రెడిట్ కార్డుల గురించి చెప్పడానికి ఇదే సరైన సమయం. జనం ఎందుకు డబ్బు బదులు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తారు? ఎప్పుడు క్రెడిట్ కార్డు వాడటం సరైనది? మీరు మీ పిల్లలకు క్రెడిట్ కార్డు తీసుకుంటే వాళ్లకు ఈ నియమ నిబంధనలు తెలియజేయండి.
మీ పిల్లలకు డబ్బు ఆదుకోవడం గురించి చెప్పడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కానీ, మీరు ఈ యాక్టివిటీలను ప్రయత్నిస్తే మీరు మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలగడం ఎంతో సరదాగా, సంతోషంగా ఉంటుంది.
రాబోయే ఫలితాల కోసం పెట్టుబడి పెట్టడం ఎంతో తెలివైన పని. అందుకే మీ పిల్లల భవిష్యత్తుకు ముందునుంచే బంగారు బాట వేయండి.
మీరు మీ పిల్లలతో ఏ పద్ధతిలో మాట్లాడినా, మాట్లాడటం మొదలు పెట్టడమే అన్నిటికంటే ముఖ్యమని గుర్తుంచుకోండి.